హైదరాబాద్: హైదరాబాద్, దాని శివారు ప్రాంతాల్లో ఇళ్లు, ఫ్లాట్ల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వాటి వివరాలను ప్రాప్‌టైగర్.కామ్ అధ్యయనం వెల్లడిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అన్ని ఒడుదొడుకులను ఎదురొడ్డి నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇళ్లు , స్థలాలు కొనుగోలు చేయడానికి స్థానికులే ముందుకు వస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఫ్లాట్ల అమ్మకాలు 140 శాతం పెరిగింది. నగర శివారులోని బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట, దుండిగల్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో విక్రయాలు బాగా పుంజుకున్నాయి.
ఇళ్లు, ఫ్లాట్ల ధరలు బేరీజు వేసుకున్నప్పుడు ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్ టాప్‌లో ఉన్నాయి. హైదరాబాద్‌లో చదరపు అడుగు ధర రూ. 5800 నుంచి 6000 వరకు ఉంది. ఇళ్లు, ఫ్లాట్ల ధరలరీత్యా దేశంలోని ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది.
ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోలులో ఠారెత్తిస్తున్న నగరాల్లో హైదరాబాద్ సెకండ్!
- Advertisement -
- Advertisement -
- Advertisement -