Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో రోజురోజుకి పెరుగుతోన్న అలెక్సా ఉపయోగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌ అమెజాన్‌. ఇప్పటికే ఎన్నో ఉత్పత్తుల ద్వారా వినియోగదారులకు దగ్గరైన అమెజాన్‌.. ఇప్పుడు అలెక్సాలోనూ అగ్రపథంలో దూసుకెళ్తోంది. అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్స్‌ని ఇప్పుడు ఎక్కువమంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రాష్ట్రాల వినియోగదారులు అలెక్సా అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ ఎకో స్మార్ట్ స్పీకర్‌లను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాని ఫలితమే ఈ 2 రాష్ట్రాల్లో అమెజాన్ ఎకో వినియోగదారుల సంఖ్య గత రెండేళ్లలో 48 శాతం పెరిగింది. ఈ జాబితాలో హైదరాబాద్ టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో విశాఖపట్నం, గుంటూరు, మెదక్, చిత్తూరు మరియు నెల్లూరు నగరాలు ఉన్నాయి.

వినియోగదారులకు నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలి. అదే సమయంలో సమగ్రమైన సమాచారం కూడా కావాలి. అందుకోసం ఇప్పుడు అందరూ అలెక్సాను అడుగుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాకుండా జోక్స్‌, విజ్ఞానం, క్రికెట్ స్కోర్‌, స్మార్ట్ హోమ్ కంట్రోల్, షాపింగ్ మరియు మరెన్నో వాటిని అలెక్సానే అడుగుతున్నారు. అందుకోసమే అమెజాన్‌ కూడా ఈ సర్వీసుని ఇంగ్లిషు, హిందీ మరియు హింగ్లీష్‌లలో అందిస్తోంది. అమెజాన్‌ ఎకో పరికరాలతో పాటు, ఇతర బ్రాండ్‌లైనటువంటి ఆండ్రాయిడ్‌, ఫైర్‌ టీవీ ఎక్విప్‌మెంట్‌, అలెక్సా బిల్ట్-ఇన్ స్పీకర్లు, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు తదితర వస్తువుల కోసం అమెజాన్‌ షాపింగ్ యాప్‌లో అలెక్సాతో ఇంటరాక్ట్ అవ్వడానికి వినియోగదారులు బాగా ఇష్టపడుతున్నారు.

నాన్‌ మెట్రో నగరాల్లో పెరిగిన స్మార్ట్‌ స్పీకర్ల వినియోగం

‘మెట్రో నగరాల్లో కాకుండా ఆ తర్వాతి స్థానాల్లో ఉంటే నగరాలు, పట్టణాల్లో ఈ మధ్యకాలంలో స్మార్ట్‌ స్పీకర్ల వినియోగం బాగా పెరిగింది. ఇందుకోసం అమెజాన్‌.. కార్వీ ఇన్‌సైట్స్ పేరుతో ఒక సర్వే చేయించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. నాన్-మెట్రో నగరాల్లోని వినియోగదారులు ప్రతిరోజూ సగటున 2.5 గంటలకు పైగా స్మార్ట్ స్పీకర్‌లను ఉపయోగిస్తున్నారని తేలింది. అంతేకాకుండా దాదాపు స్మార్ట్‌ స్పీకర్స్‌ ఉపయోగించే 81% కుటుంబాల్లోని వ్యక్తులు ఈ స్మార్ట్ స్పీకర్స్‌ని ప్రతి ఒక్కరూ యాక్సెస్ చేసేలా అందరికి అందుబాటులో ఒక గదిలో ఉంచుతున్నారు. ఇక స్మార్ట్ స్పీకర్స్‌ని ఉపయోగించే 55% మంది వినియోగదారులు ఇదివరకటి కంటే ఇప్పుడు సంగీతాన్ని బాగా ఆస్వాదించగలుగుతున్నారని కూడా అధ్యయనం తేల్చిచెప్పింది. వినియోగదారులు స్మార్ట్ స్పీకర్‌లలో సంగీతాన్ని ఆస్వాదించడానికి ప్రధాన కారణాలు – సౌండ్ క్వాలిటీ (58%), మల్టీ టాస్కింగ్ సమయంలో సంగీతాన్ని వినే సౌకర్యం (53%), అలాగే వాయిస్‌తో పాటలు మరియు వాల్యూమ్‌ను మార్చడం (44%) లాంటి అంశాలు దోహదపడుతున్నాయి.

“నిరంతర ఆవిష్కరణలు, అలెక్సా సామర్థ్యాల గురించి ఎప్పటికప్పుడు వినియోగదారలకు సమాచారం అందించడం. దీనివల్లే మా పరికరాలు ప్రతీ ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తున్నాయని మేం భావిస్తున్నాం. ఉదాహరణకు తెలుగుతో పాటు వివిధ భారతీయ భాషల్లో సంగీతాన్ని ప్లే చేయడం, హ్యాండ్స్-ఫ్రీ బిల్లు చెల్లింపులు వంటి కొత్త ఫీచర్‌లను అలెక్సాకు జోడించడం, క్రికెట్, ఎన్నికలు మరియు కోవిడ్-19 వంటి భారతీయులు ఎక్కువగా కోరుకునే సమాచారాన్ని అలెక్సాలో ఎప్పటికప్పుడు అందిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అలెక్సా వినియోగం పెరగడం మాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది అని అన్నారు అలెక్సా – అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ దిలీప్ ఆర్‌.ఎస్‌.

వినియోగదారుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తున్న టాప్‌ ట్రెండ్స్‌

● పాటలు మరియు సంగీతం.. ఈ రెంటిని అలెక్సా నుంచి కోరుకునే వినియోగదారులు ఎక్కువ. ఇంకా చెప్పాలంటే భారతదేశంతో అత్యంత ప్రజాదరణ పొందిన రిక్వెస్ట్‌ కూడా ఇదే. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ప్రతిరోజూ 21.6 లక్షల కంటే ఎక్కువ పాటలను ప్లే చేయమని అలెక్సాని అడుగుతున్నారు.

● హైదరాబాదీలు అలెక్సాను ఉపయోగించి అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్‌లో తెలుగు సినిమా పాటలను వినడానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం నగరంలో అలెక్సా కస్టమర్‌లలో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 పాటల్లో, 5 పాటలు టాలీవుడ్‌ సాంగ్స్‌ ఉన్నాయి. సర్కారు వారి పాట సినిమాలోని ‘కళావతి’, పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా ఊహాం అంటావా ‘ అలాగే ‘శ్రీవల్లి’ సాంగ్‌, డిజే టిల్లు సినిమాలోని ‘టిల్లు అన్నా డిజె పెడితే’ పాటలు ఉన్నాయి. అలాగే RRR నుంచి ‘నాటు నాటు’ పాట కూడా టాప్‌ లిస్ట్‌లో ఉంది.

● సినిమా పాటలు కూడా ఇతర సాంగ్స్‌ విషయానికి వస్తే… M. S. సుబ్బులక్ష్మి గాత్రంతో అమృతతుల్యంగా మారిన ‘విష్ణు సహస్రనామం’ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. అలాగే అలీ సేథి మరియు షే గిల్‌ల ‘పసూరి’, ఇంగ్లీష్ ఇండీ-రాక్ బ్యాండ్ గ్లాస్ యానిమల్స్ అందించిన ‘హీట్ వేవ్స్’ వంటివి కూడా టాప్‌ లిస్ట్‌లో ఉన్నాయి. “అలెక్సా, హైదరాబాద్ నుంచి పాపులర్‌ అయినటువంటి పాటలను ప్లే చేయండి” అని చెప్పడం ద్వారా వినియోగదారులు హైదరాబాద్ లేదా ప్రపంచంలోని ఏ మూల నుంచి అయినా టాప్ పాటలను ఈజీగా వినవచ్చు.

● వినియోగదారులు ఫైర్‌ టీవీ మరియు ఎకో షో పరికరాలలో అలెక్సాని అడగడం ద్వారా వారికి ఇష్టమైన టీవీ కార్యక్రమాలు మరియు సినిమాలను చూస్తున్నారు. ఫైర్‌ టీవీలో, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, యాపిల్‌ టీవీ, యూట్యూబ్‌, జీ 5, వూట్‌ వంటి కంటెంట్‌ను అలెక్సాలో వాయిస్‌ కమాండ్‌ ద్వారా ఈజీగా చూసేయవచ్చు. “అలెక్సా, తెలుగు సినిమాలు ప్లే చెయ్‌” అని అడిగితే వాటి అన్నింటిని అలెక్సా అందిస్తుంది. ఇక ప్రైమ్ వీడియోలో 2022లో అత్యధికంగా ఎక్కువమంది చూసిన సినిమా పుష్ప: ది రైజ్, రాధే శ్యామ్, సర్కారువారిపాట, ఆచార్య మరియు K.G.F చాప్టర్ 2.

● అలెక్సాతో పని చేసే స్మార్ట్ గృహోపకరణాల ఎంపిక 72% పెరిగింది. ఇందులో షియోమి, వన్‌ ప్లస్‌, హింద్‌వేర్‌, అటామ్‌బెర్గ్‌ వంటి బ్రాండ్‌ల ఉన్నాయి. రూ. 500 నుంచి మొదలయ్యే బల్బులు, ప్లగ్‌లు, తాళాలు, కెమెరాలు, సీలింగ్ ఫ్యాన్‌లు, టీవీలు, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు మొదలైనవి ఉన్నాయి. అలెక్సా ప్రతిరోజు స్మార్ట్ గృహోపకరణాలను నియంత్రించడం కోసం 2.6 లక్షలకు పైగా రిక్వెస్ట్‌లను తీసుకుంటోంది.

● క్రికెట్ స్కోర్‌లు, సినిమా డైలాగ్‌లు, పదాల అర్థాల దగ్గరనుంచి కఠినమైన లెక్కలు, వాతావరణం మరియు తాజా స్టాక్ మార్కెట్ అప్‌డేట్‌ల వరకు, వినియోగదారులు అలెక్సాను అనేక రకాల ప్రశ్నలు అడుగుతారు. అలెక్సా ప్రతిరోజూ 1.7 లక్షలకు పైగా రిక్వెస్ట్‌లను రెస్పాండ్‌ అవుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News