Saturday, December 28, 2024

క్యాంపస్ సెలెక్షన్లలో ఎంపిక కాలేదని విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థి కాలేజీలో జరిగిన క్యాంపస్ సెలెక్షన్లలో ఎంపిక కాలేదని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లోని షేట్‌బషీరాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లాలో ఎండి మహ్మద్(22) మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఇసి నాలుగోవ సంవత్సరం చదువుతున్నాడు. ప్లేస్‌మెంట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. పలు ఇంటర్వ్యూలకు హాజరైన ఎక్కడ ఉద్యోగం దొరకడం లేదని పలుమార్లు స్నేహితులతో చెప్పాడు. బుధవారం తన చదువుతున్న కాలేజీలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ జరుగుతుండడంతో హాజరయ్యారు. క్యాంపస్ సెలెక్షన్లలో ఎంపికకాకపోవడంతో తన రూమ్‌కు వచ్చాడు. నిన్న సాయంత్రం స్నేహితులు బయటకు వెళ్లడంతో రూమ్‌లో ఒక్కడే ఉన్నాడు. రాత్రి 11 గంటలకు స్నేహితులు వచ్చేసరికి రూమ్‌లో మహ్మద్ ఉరేసుకొని కనిపించాడు. స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతుడి పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News