Monday, December 23, 2024

ఎస్‌ఆర్ నగర్‌లో ప్రైవేటు బస్సు బీభత్సం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించిన సంఘటన హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ఓ వ్యక్తిని ఢీకొనడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. అమీర్ పేట నుంచి కూకట్‌పల్లి వైపు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News