Tuesday, November 5, 2024

ఖర్చు తక్కువ.. కిక్కెక్కువ!

- Advertisement -
- Advertisement -

‘మత్తు’కు బానిసగా మారుతున్న యువత
నగరంలో జోరుగా గంజాయి దందా, షాపులు, పాఠశాలలు, నిర్మానుష్య ప్రదేశాల్లో విక్రయాలు
కౌన్సెలింగ్‌తోనే సరిపెడుతున్న పోలీసులు, విద్యాసంస్థల్లో అవగాహనకు ఏర్పాట్లు

 Hyderabad start-ups want cannabis cultivation

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో గంజాయి గుప్పుమంటోంది! యువత, విద్యార్థులే లక్షంగా సాగు తున్న ఈ గలీజు దందా తమ కార్యకలాపాలను గల్లీగల్లీకి విస్తరిస్తోంది! విద్యాసంస్థలు, షాపులు, నిర్మానుష్య ప్రదే శాల్లో జోరుగా విక్రయాలు సాగిస్తూ యువత భవిష్యత్తు ను ప్రశ్నార్థకం చేస్తోంది!

అలవాటు నుంచి విక్రేత వరకు..

రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ ప రిధిలో ఈ గంజాయి దందా చాప కింద నీరులా విస్త రించింది. తొలుత సరదా కోసం మత్తు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్న యువత క్రమంగా దానికి బానిసై దళారులతో చేతులు కలిపి విక్రయించే స్థితికి చేరుకుంటు న్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ కిక్కు వస్తుండడంతో కొందరు యువకులు గంజాయి సేవనంపై మక్కువ చూ పుతున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఇటీవల సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తొలుత డ్రగ్స్‌కు అలవాటై కొద్దికాలానికే గోవా నుంచి డ్రగ్స్ తరలించి వ్యాపారం చేస్తూ ఎక్సైజ్ పో లీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విద్యార్థులు, మైనర్లు మత్తు రక్కసి కోరలకు చిక్కుకుం టుండడంతో వారి భవిష్యత్

గుట్టుచప్పుడు కాకుండా..

షాపులు, పాఠశాల పరిసరాల్లో ఉండే నిర్మానుష్య ప్రాం తాలు గంజాయి విక్రయానికి అడ్డాలుగా మార్చుకుంటు న్నారు. ఎపిలోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా నగరానికి రవాణా అవుతున్న గంజా యిని స్థానికంగా కొన్ని ముఠాలు విక్రయాలకు పాల్పడు తున్నారు. సికిందరాబాద్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి తది తర ప్రాంతాల్లో కొన్ని దుకాణాల్లో గంజాయి సేవిం చేందుకు వినియోగించే పేపర్, ఖాళీ గొట్టాలను విక్రయి స్తున్నారు. వీటిని దుకాణదారులు ప్రత్యేకంగా గోవాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు.

తల్లిదండ్రుల సమక్షంలో..

ఇదిలాఉంటే ఓవైపు గంజాయి సేవిస్తున్న మైనర్లను అదు పులోకి తీసుకున్న పోలీసులు వారి భవిష్యత్తుకు ఇబ్బం ది ఎదురవకుండా తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చిపంపుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి వి క్రేతలపై కేసులు నమోదు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇంకోవైపు నుంచి గంజాయి అక్రమ గాన్ని అరికట్టేందుకు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్ర మాలు ఏర్పాటు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో మాదక ద్ర వ్యాలకు యువకులతో పాటు యువతులు సైతం బానిస లుగా మారుతున్నారని పోలీసులు గుర్తించారు. కొందరు మత్తుకు బానిసై దొంగతనాలకు పాల్పడడం, దురుసు ప్రవర్తన, చివరికి డ్రగ్స్ అమ్మడం వరకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలతో జీవితాలు నాశనం చేసుకుంటుండడం విచాకరం. మరికొందరు ఆల్కహాలు, గంజాయికి బానిస లుగా మారి డీ అడిక్షన్ కేంద్రాలకు వస్తున్నారని ఆయా సంస్థల నిర్వాహకులు పేర్కొంటున్నారు.

మెదడుపై ప్రభావం

గంజాయి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఆ మత్తు పదార్థం సేవించగానే సైకోగా మారే అవకాశాలుం టాయని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు. ఒకవైపు గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు కట్టుది ట్టమైన చర్యలు తీసుకుంటున్నప్నటికీ గంజాయి విక్రయ దారులు గట్టుచప్పుడు కాకుండా రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. గంజాయి విక్రయాలపై ప్రత్యేక దృష్టిసారిస్తు న్నామని, పిల్లల తల్లిదండ్రులు సైతం వారి పిల్లల నడవ డికపై నిఘా పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. అదేవి ధంగా అనతికాలంలో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్ర యాలతో పాటు వినియోగంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తా మని పోలీసు అధికారులు వివరిస్తున్నారు. అలాగే ఎవ రైన గంజాయి, మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారన్న అనుమానం ఉంటే సమాచారమివ్వా లని పోలీసు అధికారులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News