Sunday, December 22, 2024

అమెరికా షాపులో దొంగతనం చేసిన హైదరాబాద్ విద్యార్థిని అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమెరికాలోని ఓ గ్రాసరీ స్టోర్ లో హైదరాబాద్ , గుంటూరుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు దొంగతనానికి పాల్పడినందుకు అరెస్టయ్యారు. వారి వయస్సు 20, 21 సంవత్సరాలు. మార్చి 19న వారిని అరెస్టు చేశారు. వారిద్దరూ అమెరికాలేని స్టీవెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉన్నత చదువుతు చదువుతున్నారు. వారు హోబోకెన్ షాప్ రైట్ లో కొన్ని వస్తువులు కొని ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఉడాయించారు.

తాము షాపు నుంచి వెళ్లిపోయేప్పుడు డబ్బు చెల్లించామని వారు తెలిపారు. వారిలో ఒకరు అంతకు ముందు దొంగిలించిన వస్తువులకు కూడా రెట్టింపు చెల్లిస్తానని ప్రాధేయపడ్డటు కథనం. మరొకరు తమను వదిలేయమని, ఇలా ఇంకోసారి చేయమని ప్రాధేయపడ్డటు కూడా కథనం.

కొన్ని వస్తువులకు డబ్బెందుకు చెల్లించలేదని పోలీసులు ప్రశ్నించినప్పుడు, వారిలో ఒకామె తన వద్ద తగినంత డబ్బులేకుండిందని జవాబిచ్చింది. వారిపై చర్యలు తీసుకుంటామని అక్కడి పోలీసులు వారికి తెలిపారు. అమెరికాలో మళ్లీ ఆ షాపుకు రాబోమని రాసివ్వాల్సిందిగా వారిని పోలీసులు ఆదేశించారు. 2015లో కూడా ఇలాగే ఓ భారతీయ మహిళ అమెరికాలోని టెన్నెస్సీలో ఉన్న వాల్ మార్ట్ స్టోర్ నుంచి 155 రేజర్లు దొంగిలించడం కూడా సిసిటివిలో రికార్డయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News