Sunday, December 22, 2024

కెనడాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ కు చెందిన షేక్ ముజమ్మిల్ అహ్మద్ అనే 22 ఏళ్ల విద్యార్థి కెనడాలో మరణించాడు. టౌలీచౌకీలోని బాల్ రెడ్డి నగర్ కాలనీకి చెందిన ముజమ్మిల్ 2022 డిసెంబర్ లో కెనడా వెళ్లాడు. అక్కడ కిట్చెనర్ సిటీలోని వాటర్లూ క్యాంపస్ లో కోనెస్టోగా కాలేజీలో కంప్యూటింగ్/ ఐటీ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు.

ముజమ్మిల్ గత వారం అనారోగ్యం బారిన పడ్డాడు. జ్వరంతో బాధపడుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించినట్లు తెలుస్తోంది. ముజమ్మిల్ మరణించినట్లు అతని స్నేహితుల ద్వారా  హైదరాబాద్ లోని అతని తల్లిదండ్రులకు తెలిసింది.

ముజమ్మిల్ భౌతిక దేహాన్ని హైదరాబాద్ తీసుకురావడంలో సహకరించవలసిందిగా విదేశీ వ్యవహారాల మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ను కోరామని ముజమ్మిల్ బంధువు మహ్మద్ అమ్జాద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News