Monday, January 20, 2025

విషాదం..కెనడాలో హైదరాబాద్ యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

కెనడాలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. ఈత‌ కొట్టేందుకు లేక్ క్లియ‌ర్‌లోకి దిగి నీటిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మీర్‌పేట‌కు చెందిన ప్రణీత్ కెనడాలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈ క్రమంలో అతని సోదరుడి బర్త్ డే సందర్భంగా స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ స్విమ్మింగ్ కోసం టొరంటోలోని లేక్ క్లియర్ కు వెళ్ళాడు.

నీటిలో దిగి ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు లేక్ లో మునిగిపోయిన ప్రణీత్ మరణించాడు. ఈ విషయాన్ని స్నేహితులు అతని కుటుంబానికి తెలిపారు. ప్రణీత్ కుటుంబంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. అత‌ని త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు, స్నేహితులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు.తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ప్రణీత్ కుటుంబ ప్రభుత్వాన్ని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News