Wednesday, January 22, 2025

పక్కా ప్లాన్ ప్రకారమే హత్య..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః  ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని కిరాతకంగా హత్య చేసిన సంఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు కీలక విషయాలు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. తాను ప్రేమించిన యువతికి నవీన్ తరచూ మెసేజ్‌లు పెడుతూ తమ ప్రేమకు అడ్డువస్తున్నాడని హరిహరకృష్ణ మూడు నెలల ముందు గాను ప్లాన్ వేసుకున్నాడు. దానిలో భాగంగా కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశాడు. ఈ నెల 17వ తేదీన పక్కా ప్లాన్ చేసిన తర్వాత నగరానికి నవీన్‌ను రప్పించాడు. బాధితుడితో కలిసి పెద్దఅంబర్‌పేటలో మద్యం తాగారు. మద్యం తాగిన తర్వాత ప్రియురాలి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

తర్వాత ఇక్కడికి సమీపంలో గంజాయి లభిస్తుందని చెప్పడంతో నవీన్, హరిహరకృష్ణతో కలిసి ఓఆర్‌ఆర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ గొంతునులిమి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత తల, వేళ్లు, ఇతర భాగాలను కత్తితో వేరు చేసి బ్యాగులో వేసుకుని పరారయ్యాడు. వాటిని తీసుకుని వెళ్లి బ్రాహ్మణపల్లి పరిధిలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. అక్కడికి సమీపంలోని ఉన్న తన స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడు, అక్కడే స్నానం చేసి దుస్తులు మార్చుకున్నాడు. నవీన్ హత్య చేసిన విషయం హసన్‌కు చెప్పాడు, మరుసటి రోజు ప్రియురాలు మేఘనారెడ్డికి కూడా చెప్పాడు.

ఆ తర్వాత వరంగల్,కోదాడ, ఖమ్మం, విశాఖపట్నం వెళ్లాడు. అక్కడి నుంచి ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌కు తిరిగి వచ్చి నవీన్ శరీరం విడిభాగాలను సేకరించి దహనం చేశాడు. అదే రోజు సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఎక్కడా నోరు విప్పని ప్రియురాలు…
గతంలో తాను ప్రేమించిన నవీన్ కన్పించడం లేదని అతడి స్నేహితులు పలుమార్లు మేఘనారెడ్డికి ఫోన్లు చేసినా కూడా ఎక్కడా హత్య విషయం చెప్పలే. పై పోలీసులకు ఫిర్యాదు చేశారా అనే విషయం నవీన్ స్నేహితుల నుంచి ఆరాతీసింది. యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News