Wednesday, April 16, 2025

బౌలింగ్ కలవరపెడుతోంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో అభిషేక్ శర్మ కళ్లు చెదిరే శతకం సాధించి హైదరాబాద్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. కాగా, ఈ సీజన్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగంలో కూడా సన్‌రైజర్స్ నిరాశ పరుస్తోంది.

సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ చెత్త ప్రదర్శనతో తేలిపోతున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా షమి పూర్తిగా చేతులెత్తేశాడు. స్టోయినిస్ వరుసగా నాలుగు సిక్సర్లు బాది షమికి చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో షమి 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు సమర్పించుకున్నాడు. దీన్ని బట్టి అతని బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కెప్టెన్ కమిన్స్ కూడా తన స్థాయికి తగ్గ బౌలింగ్‌ను కనబరచలేక పోతున్నాడు. హర్షల్ పటేల్, మలింగ, జిషాన్ తదితరులు జట్టులో ఉన్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. రానున్న మ్యాచుల్లోనైనా బౌలర్లు తమ బంతికి పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News