Friday, April 4, 2025

ట్యాంకుబండ్‌పై కారు బీభత్సం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ట్యాంకుబండ్‌పై కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లింది. కారులోని బెలూన్ బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. కారు వదిలి ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాజేంద్రనగర్‌లోని ఆరంఘర్ చౌరస్తా వద్ద ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాన్ని, బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో కారు నడిపారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బురఖా ధరించకపోతే బస్సు ఎక్కకూడదట !

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News