Sunday, December 22, 2024

తార్నాకలో మహిళపై సామూహిక అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళకు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి నిర్మానుష్యా ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని తార్నాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రశాంత్‌నగర్‌కు చెందిన బర్నే యేసు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 7న అర్ధరాత్రి పని ముగించుకొని తార్నాక నుంచి ప్రశాంత్‌నగర్ వైపు వెళ్తున్నాడు. తార్నాక బస్టాప్‌లో మహిళ కనిపించడంతో మాయమాటలు చెప్పి లిఫ్ట్ ఇచ్చాడు. లాలాపేటలో దింపుతానని చెప్పి వాహనంపై ఎక్కించుకున్నాడు. ప్రశాంత్‌నగర్‌లోని రైల్వే క్వార్టర్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. మరో నలుగురిని స్నేహితులను పిలిపించుకొని ఆమెపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని తార్నాకలో వదిలి వెళ్లిపోయారు. బాధితురాలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమె స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News