Thursday, January 2, 2025

రంజీ ట్రోఫీ… హైదరాబాద్ జట్టు కెప్టెన్ అతడే

- Advertisement -
- Advertisement -

రంజీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును ఎంపిక చేశారు. తిలక్ వర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రాహుల్ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. రంజీ సీజన్ కోసం 15 మందితో కూడిన జట్టును హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రకటించింది. తిలక్ వర్మతో పాటు రాహుల్ సింగ్, సివి మిలింద్, తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, నితేష్ కన్నాల, అభిరథ్ రెడ్డి, హిమతేజ, రాహుల్ రాదేశ్, రక్షన్ ర్డె, కార్తీకేయ, సరను నిశాంత్‌లను ఎంపిక చేశారు. బుధి రాహుల్, వరుణ్ గౌడ్, రిషబ్ , భగత్ వర్మ, అజయ్ దేవ్‌లను స్టాండ్‌బైలుగా ప్రకటించారు. ప్రధాన కోచ్‌గా వినీత్ సక్సెనా, అసిస్టెంట్ కోచ్ అమిత్‌ను ఎంపిక చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News