Sunday, December 22, 2024

హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న బస్సు బోల్తా

- Advertisement -
- Advertisement -

మహిళ మృతి, 15 మందికి గాయాలు

హైదరాబాద్: అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)లో ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న బస్సు బోల్తాకొట్టింది. అవుటర్ రింగ్ రోడ్డు నార్సింగి వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

బస్సు పటాన్ చెరు నుంచి చెన్నైకు వెళుతున్న బస్సు నార్సింగి వద్ద రాత్రి 9.00 గంటలకు బోల్తా కొట్టింది. బస్సు రోడ్డు మధ్యగా వెళ్లి ఓ పోల్ ను ఢీకొని బోల్తా కొట్టింది. దాంతో బస్సు కింద మమతా అనే మహిళ పడి మృతి చెందింది. ఆ తర్వాత క్రేన్ సాయంతో బస్సును లేపారు. మృతి  చెందిన మహిళ మృత దేహాన్ని మార్చురికి పంపారు. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వారందరికీ ప్రథమ చికిత్స అందించారు. ఈ దుర్ఘటనతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ప్రాథమిక దర్యాప్తులో బస్సు స్పీడు కారణంగా దుర్ఘటన జరిగిందని తెలిసింది. బస్సు డ్రయివర్ వాహనంపై అదుపు తప్పాడని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News