Saturday, November 23, 2024

ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ సంస్థల షాక్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు ఎయిర్‌లైన్ సంస్థలు షాక్ ఇచ్చాయి. మరోసారి విమాన చార్జీలను భారీగా పెంచాయి. ఈనెల 10వ తేదీన ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఒకరోజు దీక్ష చేపట్టాలని నిర్ణయించడం, ఈలోపు కవితకు బుధవారం ఈడీ నోటీసులు అందించడం కవిత వెనువెంటనే ఢిల్లీకి వెళ్లడంతో బిఆర్‌ఎస్ నాయకులు, జాగృతి సంస్థకు చెందిన కార్యకర్తలు భారీగా ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎయిర్‌లైన్స్ చార్జీలను సుమారుగా రూ.30 నుంచి రూ.50 వేల వరకు చార్జీలను పెంచాయి. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో బిఆర్‌ఎస్ నాయకులతో పాటు జాగృతి కార్యకర్తలు కవితకు మద్ధతుగా ఢిల్లీకి క్యూ కట్టారు. మాములుగా అయితే రూ10వేల నుంచి రూ.15వేల లోపు ఉండే చార్జీలు భారీగా పెరగడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన ఇదే మాదిరిగా…
గత సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించడానికి వెళ్లినప్పుడు ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ ధరలు ఏకంగా నాలుగింతలు పెంచి బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎయిర్‌లైన్స్‌లు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో కార్యక్రమం ముగించుకొని తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు ప్రయత్నించిన కార్యకర్తలు రైలుతో పాటు వివిధ మార్గాల ద్వారా తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం అదే మాదిరిగా విమాన చార్జీలు పెంచడంతో బిఆర్‌ఎస్ నాయకులు, జాగృతి కార్యకర్తలు ఊసురుమంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News