Thursday, January 9, 2025

హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్

- Advertisement -
- Advertisement -

దేశంలోనే మొట్టమొదటి సేఫ్టీ
ఇంజినీరింగ్ సెంటర్‌ను ఏర్పాటు
చేయనున్న గూగుల్ సంస్థ
అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ
హబ్‌గా అవతరించనున్న
కేంద్రం సైబర్ సెక్యూరిటీ
సమస్యలకు వేగంగా పరిష్కారం
వేల సంఖ్యలో దక్కనున్న
ఉద్యోగావకాశాలు అనేక
నగరాలు పోటీపడినా..
హైదరాబాద్‌కే మొగ్గు చూపిన
మేటి ఐటి సంస్థ సిఎం
రేవంత్‌రెడ్డి హర్షం

మన తెలంగాణ/హైదరాబాద్ : గూగుల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పం దం చే సుకుంది. దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌ను హై దరాబాద్ లో నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ ముందుకొచ్చింది. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెం టర్ ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్ కావడం విశేషం.అధునాతన భద్ర త, ఆన్‌లైన్ భద్ర తా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో ఇ ది కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారి త భద్రత, సైబర్ సెక్యూరిటీ నిపుణు లు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకార వేదికగా ఉపయోగపడు తుంది. దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, ఉపాధి పెంచడం, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించే లక్ష్యంగా ఈ సెంటర్ పని చేస్తుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులున్న గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుకు ముందుకు రావడంపై ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన జరిగిన గూగుల్ ఫర్ ఇండియా-2024 కాన్‌క్లేవ్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని ఆ కంపెనీ ప్రకటించింది. అప్పటి నుంచి జీఎస్‌ఈసీని తమ రాష్ట్రంలోనే నెలకొల్పాలని, గూగుల్ పెట్టుబడులను ఆహ్వానించేందుకు వివిధ రాష్ట్రాలు పోటీ పడ్డాయి.

డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ ముందంజ
గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ అధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం బుధవారం జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా హాన్సెన్ మాట్లాడుతూ డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఇంజనీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. ఇప్పటికే ప్రపంచంలో పేరొందిన అయిదు టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్‌లు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఈ సేఫ్టీ సెంటర్ ద్వారా సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంగా పరిష్కరించే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సెంటర్ ఏర్పాటుతో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కాగా, హైదరాబాద్‌లో నెలకొల్పబోయే ఈ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలో ఐదవది కాగా, ఏషియా పసిఫిక్ జోన్‌లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ కావడం విశేషం.

హైదరాబాద్ మరోసారి ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. హైదరాబాద్‌లో ఈ సేఫ్టీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావటం చాలా ఆనందంగా, గర్వంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య ఒప్పందం చేసుకోవటంతో మరోసారి హైదరాబాద్ ప్రపంచంలో మేటి ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా అందరి దృష్టిని ఆకర్శిస్తుందని ఆయన తెలిపారు. ఏషియన్ ఫసిపిక్ జోన్‌లోని టోక్యో తరువాత హైదరాబాద్‌లో జిఎస్‌ఈసిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏఐ ఆధారంగా సెక్యూరిటీ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News