Saturday, December 21, 2024

హైదరాబాద్ శివార్లలో ఔటర్ రింగ్ రైల్

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిం ది. హైదరాబాద్ చుట్టూ కొత్తగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు వస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం ప్ర కటించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటి ప్రా జెక్టు అని తెలిపారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు స ర్వే కోసం రైల్వే శాఖ రూ.14 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు, ఔట ర్ రింగ్ రైలు ప్రాజెక్టుతో హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. రైలు కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కూడా ఈ ఔటర్ రింగ్ రైలు ద్వారా కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును రూ.26 వేల కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. భూసేకరణకు సంబంధించి 50 శాతం ఖర్చు కేంద్రమే భరిస్తుం దన్నారు.

ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు సం బంధించిన వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అందించినట్లు వివరించారు. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని, రూట్ ఎలా ఉండాలనే దానికి 99శాతం ఆమోదం లభించిందని చెప్పుకొచ్చారు. ఎంఎంటిఎస్ రెండో దశలో ఔటరి రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. మరోవైపు రీజినల్ రింగ్‌రోడ్‌కు సంబంధించి భూసేకరణ సర్వే చేస్తున్నారు. రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ సర్వే ప్రక్రియ పూర్తైనట్లు అధికారుల తెలిపారు. భూములిచ్చేది లేదంటూ రైతులు భీష్మిం చటంతో సంగారెడ్డి, రాయగిరి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల కూడా అధికారులు సర్వే పూర్తి చేశారు. రోడ్డు నిర్మాణం జరిగే 100 మీటర్ల వెడల్పుతో అలైన్‌మెంట్ ప్రకారం హద్దులు ఏర్పాటు చేశారు. ఎంఎంటిఎస్ రెండో దశకు రూ.330 కోట్ల కేటాయింపుతో పాటు, కేంద్ర నిధులతో ఘట్‌కేసర్-రాయగిరి వరుకు ఎంఎంటిఎస్ రైలు ఏర్పాటు చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News