Monday, December 23, 2024

మార్చి ఒకటి నుంచి ఉప్పల్‌లో సిసిఎల్ టోర్నమెంట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్)కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుందని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వెల్లడించారు. మార్చి ఒకటి నుంచి మూడు వరకు ఉప్పల్‌లో సినీ తారల క్రికెట్ టోర్నీ జరుగుతుందన్నారు. ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు హెచ్‌సిఎ భారీ ఏర్పాట్లు చేస్తుందన్నారు. ప్రతి రోజు పది వేల మంది కళాశాల విద్యార్థులకు మ్యాచ్‌ను చూసేందుకు ఉచితంగా అనుమతి ఇస్తామని వివరించారు. మూడు రోజుల పాటు ప్రతి రోజు రెండు మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయన్నారు. కళాశాల విద్యార్థులకు మ్యాచ్‌ను ఉచితంగా చూపించాలనే తాపత్రయంతో సిసిఎల్ నిర్వాహకులను కోరగా సానుకూలంగా స్పందించారన్నారు.

ఇంటర్, డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల విద్యార్థులకు స్టేడియంలోకి ఉచితంగా అనుమతి ఇస్తామన్నారు. ఆసక్తిగల కళాశాలల ప్రిన్సిపాల్స్ హెచ్‌సిఎ ఈమెయిల్ hca.ccl2024@gmail.comలో తమ కాలేజీ నుంచి వచ్చే విద్యార్థుల పేర్లను పంపించాలన్నారు. మ్యాచ్‌లకు వచ్చే విద్యార్థులకు కచ్చితంగా ఐడి కార్డులు కలిగి ఉండాలన్నారు. స్కూట్నీ తర్వాత హెచ్‌సిఎ సిబ్బంది కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ప్రత్యుత్తరం ఇస్తారని జగన్‌మోహన్ రావు వెల్లడించారు. సిసిఎల్‌లో టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. తెలుగు వారియర్స్, ముంబై హీరోస్, కేరళ స్ట్రయికర్స్, భోజ్‌పురి దబాంగ్స్, బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ ది షేర్ జట్లు హైదరాబాద్‌లో ఆడనున్నాయన్నారు. తెలుగు వారియర్స్ టీమ్‌కు అక్కినేని అఖిల్ సారథ్యం వహిస్తున్నట్టు జగన్‌మోహన్ రావు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News