Monday, December 23, 2024

ఉప్పల్ స్టేడియంలో మార్చి 1 నుండి సెలబ్రెటీ క్రికెట్ లీగ్ పోటీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ( సీసీఎల్), తెలుగు వారియర్స్ తో తెలంగాణ పర్యాటక శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తారామతి బారదారిలో ప్రి ఈవెంట్ మీట్ ఆఫ్ తెలుగు వారియర్స్ కార్యక్రమం జరిగింది. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలుగు వారియర్స్ టీం ప్లేయర్స్
సుధీర్ బాబు, ఆది, సుషాంత్, ప్రిన్స్ , అశ్విన్, ఆదర్శ్ బాలకృష్ణ, సంగీత దర్శకుడు థమన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారామతి బరాదరి వద్ద తెలుగు వారియర్స్ తో మంత్రి జూపల్లి ఫోటో షూట్ లోనూ పాల్గొన్నారు. మార్చి 1 నుంచి 3 వరకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రెండో దశ సెలబ్రెటీ క్రికెట్ లీగ్ పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన తారామతి బరాదరి కల్చరల్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న ప్రి- ఈవెంట్ మీట్ ఆఫ్ తెలుగు వారియర్స్ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నామన్నారు.

“ మీ అందరినీ చూస్తుంటే చిన్నప్పుడు క్రికెట్ ఆడిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల దృష్టిని ఆకర్షించే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కు హైదరాబాద్ వేదిక కావడం సంతోషదాయకం, సినిమా, క్రికెట్.. మన దేశంలో ఈ రెండు ప్లాట్ఫార్మ్ లకు ఉన్న పాపులారిటీ మరే రంగానికి ఉండదు. ఈ ఫీల్ లో ఉన్న ప్లేయర్స్ కి, యాక్టర్స్ కి కోట్లమందిలో అభిమానులు ఉన్నారు. సినిమా రిలీజ్ ఉన్నా, క్రికెట్ మ్యాచ్ ఉన్నా అభిమానులు తమ పనులను పక్కన పెట్టి మరి క్రికెట్, సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అలాంటిది ఆ రెండు ఒకే ప్లాట్ఫార్మ్ పై కనిపిస్తే అది ప్రేక్షకులకు కన్నుల పండగ అనే చెప్పాలి. తెలంగాణ పర్యాటక శాఖ… సీసీఎల్, తెలుగు వారియర్స్ తో భాగస్వామ్యం కావడం వల్ల తెలంగాణ సంస్కృతి, వారసత్వకట్టడాలు, అందమైన ప్రదేశాలను ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలకు తెలియజేయడానికి ఎంతో దోహదపడుతుందని ఆశిస్తున్నాను.

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక కేంద్రాలకు తగిన ప్రచారం కల్పించి పర్యాటకులను రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఎన్నో కార్యక్రమాలను రూపొందించబోతున్నాం. పర్యాటక రంగం అభివృద్ధి వల్ల. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని ఇక్కడకు విచ్చేసిన సెలబ్రిటీలను ఈ సందర్భంగా కోరుతున్నారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడంలో మీరందరూ భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాను. సిసిఎల్ తో విజయవంతమైన సహకారం ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను” అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ డైరెక్టర్ నిఖిల, పర్యాటక శాఖ కార్పొరేషన్ ఎండీ రమేష్ నాయుడు , సీసీఎల్ వ్యవస్థాపకులు విష్ణు ఇందూరి, తదితరుల పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News