Monday, December 23, 2024

హైదరాబాద్‌లో మరోసారి ఫార్ములా ఈ రేస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో మరోసారి ఫార్ములా ఈ రేస్
వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన పోటీలు
ట్విట్టర్ వేదికగా తెలిపిన పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి ఫార్ములా ఈ రేస్ జరగనుంది. వచ్చే ఈ ఏడాది హైదరాబాద్‌లో ఈ ఫార్ములా పోటీలు జరుగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ వేదికగా ఈ-ఫార్ములా 10వ ఏబిబి ఎఫ్‌ఐఏ సీజన్ పోటీలు జరగాయి. గురువారం సమావేశమైన ఎఫ్‌ఐఏఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ 2024 ఫార్ములాకు ఆమోదముద్ర వేసింది.దీంతో మరోసారి హైదరాబాద్‌లో ఈ రేసింగ్ జరుగనుంది.

వాతావరణ కాలుష్యాన్ని నియంత్రిస్తూ ఎలక్ట్రిక్ కార్లతో రూపుదిద్దుకున్న ఫార్ములా -ఈ రేసింగ్‌కు విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ తెలిపారు. వచ్చే సంవత్సరం జనవరి 13వ తేదీన మెక్సికోలో ఫార్ములా -ఈ రేసింగ్ జరుగనుండగా, జనవరి 20, 27వ తేదీన సౌదీఅరేబియా, ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్‌లో, మార్చి 10వ తేదీన బ్రెజిల్‌లో, మార్చి 30న జపాన్‌లో, ఏప్రిల్ 13, 14న ఇటలీలో, ఏప్రిల్ 27న మెనాకోలో, మే 11, 12వ తేదీన జర్మనీలో, మే 25, 26వ తేదీన చైనాలో, జూన్30వ తేదీన యూఎస్‌ఏలో, జూలై20,21వ తేదీన లండన్‌లో ఈ రేసింగ్ జరుగనుందని అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News