Monday, December 23, 2024

హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’!

- Advertisement -
- Advertisement -
పంజా విసరనున్న చలి పులి !

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చలి పెరిగిపోయింది. చలి విషయంలో భారత వాతావరణ శాఖ(ఐఎండి) హైదరాబాద్‌కు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. జనవరి 8, 9 తేదిల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్‌కు చేరనుంది. హైదరాబాద్‌కు చలి పులితో పాటు జనవరి 9న ఏడు జోన్లలో… అంటే చార్మినార్, ఖైరతాబాద్, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేర్లింగంపల్లిలో ఉదయం వేళలో కూడా పొగమంచు కమ్ముకోవచ్చు.

ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల్‌లో ఆదివారం, సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చు. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రత పడిపోనుంది. హైదరాబాదలోని వాతావరణ శాఖ(ఐఎండి) ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం(టిఎస్‌డిపిఎస్) ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. కాగా తెలంగాణలోని మిగతా చోట్ల 31 నుంచి 34 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News