- Advertisement -
ఆర్జిఐ నుంచి సికింద్రాబాద్ వరకు ఏర్పాటు
హైదరాబాద్: నగర పోలీసులు మరో సారి గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి తన ఉదారతను చాటుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రి వరకు శుక్రవారం గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. ఆర్జిఐ నుంచి లంగ్స్‌ను తీసుకుని 3 గంటల బయలు దేరిన అబుంలెన్స్కు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి కిమ్స్ ఆస్పత్రి మధ్య ఉన్న 36.8 కిలో మీటర్లను 25 నిమిషాల్లో చేరుకుంది. అవయవదానానికి ఏర్పాట్లు చేసి పోలీసులు వైద్యులకు సహకరిస్తున్నారు. గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసిన హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -