Sunday, December 22, 2024

హీరో మంచు మ‌నోజ్ కారుకు రూ. 700 ఫైన్

- Advertisement -
- Advertisement -

Hyderabad Traffic police impose fine to Manchu Manoj

హైదరాబాద్‌: నగర ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి, వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎవరనీ వదలకుండా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్‌ పోలీసులు చేస్తున్న తనిఖీల్లో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అడ్డంగా బుక్ అయ్యాడు. మనోజ్‌ ప్రయాణిస్తున్న ఎపి 39HY 0319 కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను గుర్తించిన పోలీసులు దాన్ని ఆపారు. నిబంధనలను అతిక్రమించి బ్లాక్‌ ఫిలిం ఉన్నందుకుగాను రూ.700 చలాన్ వేసి, అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News