Thursday, January 23, 2025

గోకుల్ చాట్, లుంబినీ పేలుళ్ళకు సరిగ్గా 17 ఏళ్లు

- Advertisement -
- Advertisement -

నగరం మొత్తం ఉలిక్కిపడిన రోజు 25 ఆగష్టు 2007. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఈరోజే లుంబినీ పార్క్, గోకుల్ చాట్ బాంబు పేలుళ్ళు జరిగాయి. సాయంత్రం పూట సరదాగా సమయం గడపడానికి బయటకు వచ్చిన అమాయకులు బాంబ్ బ్లాస్ట్ లలో ప్రాణాలు కోల్పోయారు. లుంబినీ పార్కు లో ఎప్పటిలానే లేజర్ షో ప్రారంభమైంది. సాయంత్రం ఏడున్నర సమయంలో ముందుగా వందేమా తరం గీతం వింటున్నారు అక్కడకు చేరుకున్న సందర్శకులు. దాదాపు 500 మంది వరకూ ఆ పార్కుల్లో గుమికూడారు. ఆ సమయంలో సీట్ల మద్యలో పేలిన బాంబు 9 మంది ప్రాణాలు బలిగొంది. వారిలో ఇద్దరు స్పాట్ డెడ్ కాగా తరువాత హాస్పిటల్ లో ఏడుగురు చనిపోయారు. 40 మందికి పైగా గాయాల పాలయ్యారు. చనిపోయిన వారిలో మహారాష్ట్ర నుండి స్టడీ టూరు కోసం వచ్చిన స్టూడెంట్స్ ఏడుగురు ఉండడం అందరినీ కలచి వేసింది.

మరో పది నిమిషాల గ్యాప్ లో కోఠి ప్రాంతంలోని పాపులర్ గోకుల్ చాట్ వద్ద మరో బాంబు పేలింది. ఎక్కువగా నార్త్ ఇండియన్ స్నాక్స్ దొరికే గోకుల్ చాట్ కు సిటీలో మంచి పేరుంది. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అక్కడకు చేరుకుంటూ అంటారు. అందుకే దానిని టార్గెట్ చేసుకున్న తీవ్రవాదులు అక్కడ బాంబ్ పేల్చారు. ఈ ఘటన లో మొత్తం 33 మంది 10మంది స్పాట్ లో మరో 23 మంది హాస్పిటల్ లో చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు.ఈ బాంబు పేలుళ్లకు నిషేధిత తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ కు చెందిన తీవ్రవాదులే అని తేల్చారు. టైమర్ ఉపయోగించి ఈ పేలుళ్ళను జరిపారని విచారణలో వెల్లడైంది. బాంబుల్లో జిలేటిను, అమ్మోనియం నైట్రేట్ లను వాడినట్టు తేల్చారు. పోలీసులు ఈ కేసులో మొత్తం 8 మంది పై కేసులు పెట్టారు. వారిలో మొహమ్మద్ అక్బర్ ఇస్మాయేల్ చౌదరి, షఫీక్ సయ్యద్ లకు మరణ శిక్ష విధించిన కోర్టు సరైన సాక్ష్యాలు లేవని మరో ఇద్దరిని విడుదల చేసింది.

తరువాత పట్టుబడిన మరో నలుగురికి సుదీర్ఘ విచారణ తరువాత గత ఏడాది ఒక్కొక్కరికీ పదేళ్ళ పాటు కఠిన కారాగార శిక్షను ఎన్‌ఐఎ కోర్టు విధించింది. ఒబేదుర్ రెహ్మాన్, ధనీష్ అన్సారీ, ఇమ్రాన్ ఖాన్, ఆఫ్తాబ్ ఆలం అనే ఈ నలుగురుకీ దిల్ సుఖ్ నగర్ బాంబు బ్లాస్టులతో కూడా సంబంధం ఉన్నట్టు తేల్చారు. హైదరాబాద్ లో ఆ తరువాత కూడా కొన్ని ఉగ్రవాద ఘటన లు జరిగినా గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ గుర్తుకు వస్తే ఇప్పటికే హైదరాబాద్ వాసులు ఉలిక్కి పడుతుంటారు. లుంబినీ పార్కు, గోకుల్ చాట్ రెండు పేలుళ్ళు కలిపి మొత్తం 42 మందిని బలి తీసుకున్నాయి. ఎంతో మంది తమ అవయవాలు కోల్పోయారు. నేటికీ జీవనోపాధి కోల్పోయి దయనీయ స్థితి లో బ్రతుకీడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే ఇలాంటి విషాదాలకు దారుణాలకు కారణం అవుతున్న ఈ సీమాంతర తీవ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించే దిశగా ప్రభుత్వాలు కృషి సల్పుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News