హైదరాబాద్ గెలుపు
విజయ్ హజారే ట్రోఫీ
అహ్మదాబాద్: ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. గ్రూప్‌సిలో కర్ణాటకతో మంగళవారం జరిగిన పోరులో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ తిలక్ వర్మ(99), వరుణ్ గౌడ్(109) మార్క్ బ్యాటింగ్‌తో కదంతొక్కడం తో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్షాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 320 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టె న్ మయాంక్ అగర్వాల్ (124) భారీ సెంచరీ తో మెరవగా.. ఆర్ సమరణ్(83) అర్ధ శతకంతో రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ 49.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి విజయానందుకుంది. చివరలో 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 25 తనయ్ త్యాగరాజన్ కీలక ఇన్నిం గ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్పాడు.
తిలక్‌వర్మ మెరుపులు..
- Advertisement -
- Advertisement -
- Advertisement -