- Advertisement -
హిమాచల్ ప్రదేశ్‌తో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య హైదరాబాద్ టీమ్ ఇన్నింగ్స్ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (177) అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇక హిమాచల్ ప్రదేశ్ తొఇ ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఫాలోఆన్ ఆడక తప్పలేదు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన హిమాచల్ 45.4 ఓవర్లలో 247 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ శుభమ్ అరోరా (66), అంకిత్ కల్సి (44), వైభవ్ (32) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ ఆరు, అనికేత్ రెడ్డి నాలుగు వికెట్లు పడగొట్టారు.
- Advertisement -