Friday, November 15, 2024

కదంతొక్కిన బ్రూక్.. కోల్‌కతాపై హైదరాబాద్ విజయం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసి పోరాడి ఓడింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గుర్బాజ్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్ (10), సునీల్ నరైన్ (0), ఆండ్రీ రసెల్ (3) కూడా విఫలమయ్యారు. అయితే కెప్టెన్ నితీశ్ రాణా, రింకు సింగ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో కోల్‌కతా ఆశలను చిగురింప చేశారు.

కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ 6 సిక్సర్లు, ఐదు బౌండరీలతో 75 పరుగులు సాధించాడు. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన రింకు సింగ్ 4 సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే చివరి ఓవర్లో ఉమ్రాన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ను ఓపెనర్ హ్యారీ బ్రూక్ విధ్వంసక శతకంతో ఆదుకున్నాడు. చారిత్రక ఇన్నింగ్స్‌ఆడిన బ్రూక్ 55 బంతుల్లోనే 3 సిక్సర్లు, 12 బౌండరీలతో అజేయంగా 100 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మార్‌క్రమ్ 26 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, రెండు బౌండరీలతో 50 పరుగులు సాధించాడు. అభిషేక్ శర్మ (32) కూడా రాణించడంతో హైదరాబాద్ స్కోరు 228 పరుగులకు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News