Monday, December 23, 2024

మిసెస్ ఇండియా టైటిల్‌ను కైవసం చేసుకున్న హైదరాబాద్ మహిళ

- Advertisement -
- Advertisement -
తొలి ప్రయత్నంలోనే ఆమె ఈ ఘనత సాధించింది

హైదరాబాద్: నగరానికి చెందిన మహిళ ‘మిసెస్ ఇండియా’ టైటిల్‌ను మంగళవారం సాయంత్రం గెలుచుకుంది. 14 రాష్ట్రాలకు చెందిన పోటీదారులను ఓడించి మరీ గెలుచుకుంది. కొచ్చిలోని లీ మెరిడియన్ హోటల్‌లో ప్రతిష్టాత్మక అందాల పోటీల ఫైనల్స్ జరిగాయి. అంకితా ఠాకూర్ తన తొలి ప్రయత్నంలోనే ఈ టైటిల్‌ను గెలుచుకుంది.

తెలంగాణ తరఫున ఆమె ఈ అందాలపోటీలో పాల్గొన్నది. ఆమె రష్మిక ఠాకూర్ నుంచి శిక్షణ పొందింది. ఆమె ఇదివరలో మిసెస్ ఇండియా అందాల పోటీలో గెలిచారు. అంకిత ఠాకూర్ అంకిత భావం, హార్డ్ వర్క్, రష్మిక ట్రయినింగ్ ఆమెను ఈ టైటిల్ గెలుచుకునేలా చేశాయి. అంకిత ఠాకూర్‌కు మోడలింగ్ స్కిల్స్‌తో పాటు తన ఆల్బమ్ ‘డ్రామే నా దే’ ద్వారా కూడా బాగా గుర్తింపు పొందారు. మిసెస్ ఇండియా అందాల పోటీ దేశవ్యాప్తంగా వివాహం అయిన అందం, తెలివితేటలు ఉన్న మహిళను గుర్తించే పోటీ. అది ఈసారి తెలంగాణ మహిళకు దక్కడం గర్వ కారణం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News