- Advertisement -
అమెరికా ఎయిర్ పోర్టులో గుండెపోటుతో హైదరాబాద్‌కు చెందిన మహిళ మృతిచెందింది. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన కాయిశెట్టి లక్ష్మిబాయి(70) తన మూడో కుమారుడు శ్రీధర్ అమెరికాలో ఉండడంతో అక్కడికి వెళ్లింది. సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు కుమారుడితో కలిసి వెళ్లింది. అమెరికాలోని మియామి ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత అక్కడి నుంచి స్థానిక ఫ్లైట్‌లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా లక్ష్మిబాయికి గుండెపోటు వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది సిపిఆర్ చేసినా కూడా కోలుకోలేదు. కుంభమేళాలో పాల్గొంనేందుకు మృతిరాలి కుమారుడు శ్రీధర్ ఇండియాకు వచ్చాడు. తిరిగి వెళ్తున్న సమయంలో తల్లి తీసుకుని అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలోనే లక్ష్మిబాయి గుండెపోటుతో ఎయిర్ పోర్టులో మృతిచెందింది. లక్ష్మిబాయి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
- Advertisement -