Tuesday, November 5, 2024

ఉన్మాది కాల్పుల్లో ఐశ్వర్య బలి

- Advertisement -
- Advertisement -

ఉన్మాది కాల్పుల్లో ఐశ్వర్య బలి

అమెరికాలోని డల్లాస్‌లో ఘటన
రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తున్న నర్సిరెడ్డి కూతురు

మన తెలంగాణ/సిటీబ్యూరో/ఎల్బీనగర్/నేరుడుచర్ల: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ శివారులో ఉన్న అలెన్ మాల్‌లో శనివారం మధ్యాహ్నం దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన సంఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి మృతి చెందింది. దుండగుడి కాల్పుల్లో 8మంది మరణించగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా, నేరడుచర్ల గ్రామానికి చెందిన తాటికొండ నర్సిరెడ్డి, తాటికొండ అరుణ కుమార్తె తాటికొండ ఐశ్వర్య(27) ఇటీవల కాలంలోనే ఎంఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లింది. నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తూకు టుంబంతో పాటు సరూర్‌నగర్‌లోని హూడా కాలనీలో ఉంటున్నాడు.

ఎంఎస్సీ చదివేందుకు ఐశ్వర్య ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లింది, చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఫర్‌ఫెక్ట్ జనరల్ కాట్రాక్ట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 18వ తేదీన ఐశ్వర్య పుట్టిన రోజు కావడంతో వాచ్‌ను కొనుగోలు చేసేందుకు శనివారం మధ్యాహ్నం షాపింగ్ కోసం అలెన్ మాల్‌కు వెళ్లింది. అదే సమయంలో కారులో గన్‌తో వచ్చిన మౌరిసియో గార్సియా అనే వ్యక్తి మాల్ సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి లోపలికి ప్రవేశించాడు. వెంటనే మాల్‌లో ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన సమయంలో మాల్‌లో వందలమంది ఉండడంతో భయంతో కేకలు వేస్తూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తారు. కాల్పుల శబ్దాలు, ప్రజల కేకలతో అక్కడే విధుల్లో ఉన్న ఓ పోలీసు గమనించి నిందితుడిని కాల్చిచంపాడు. లేకుంటే మాల్‌లో భారీఎత్తున ప్రాణనష్టం జరిగేది.

కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు, ఐశ్వర్యకు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొం దుతూ మృతిచెందింది. ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్‌కు రప్పించేందుకు కుటుంబ సభ్యులతోపాటు అమెరికా తెలుగు సంఘాలు కూడా సన్నాహాలు చేస్తున్నాయి. యువతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పలువురు లాయర్లు జడ్జి నర్సిరెడ్డిని కలిసేందుకు ఇంటికి వచ్చారు. ఐశ్వర్య నేరెడుచర్ల మాజీ ఎంపీపీ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాటికొండ రాంనర్సింహారెడ్డి మనుమరాలు. అమెరికాలోని పర్‌ఫెక్ట్ జనరల్‌లో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్న ఐశ్వర్య కాల్పుల్లో మృతి చెందగా పట్ల పాత నేరెడుచర్లలో విషాధ ఛాయలు నెలకొన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News