Sunday, December 22, 2024

అరబ్ దేశంలో హైదరాబాదీకి వేధింపులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌కు చెందిన యువతి అరబ్ కంట్రీలో భర్త చేతిలో చిత్రహింసలకు గురవుతోంది. తనను కాపాడాలని తల్లిదండ్రులకు బాధితురాలు వీడియోలు పంపించడంతో విషయం బయటికి వచ్చింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన సబా బేగంని అరబ్ దేశానికి చెందిన ముక్తాదీర్ అనే వ్యక్తికి ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు. వివాహం తర్వాత యువతిని భర్త అరబ్ దేశానికి తీసుకుని వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత నుంచి సబా బేగంను వరకట్నం తేలేదంటూ భర్త చిత్ర హింసలు పెట్టడం ప్రారంభించాడు. కనీసం తిండికూడా పెట్టకుండా ఓ గదిలో బంధించి రబ్బర్ మ్యాట్‌తో యువతిని భర్త చితకబాదాడు. యువతి గది నుంచి బయటకు రాకుండా..

కిటికీలన్నీ మూసి వేసి గదికి తాళం వేశాడు. సబాను రబ్బర్ మ్యాట్‌తో కొట్టడంతో ఒళ్లంతా దెబ్బలే. కనీసం ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు కూడా ఆ కసాయి భర్తకు మనసు రాలేదు. తన కూతురుని కాపాడాలంటూ విదేశాంగ మంత్రికి తల్లి లేఖ రాసింది. అరబ్ కంట్రీ మక్కాలో ఉంటున్న తన్ కూతురిని భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ లేఖలో పేర్కొంది. భర్త నుంచి తన కూతురని ఎలాగైనా కాపాడాలని కోరింది. కనీసం తన కూతురుతో మాట్లాడ నివ్వడం లేదని, ఒళ్లంతా గాయాలవడంతో రక్తస్రావమై ఎక్కడికక్క గడ్డలు కట్టినల్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News