Thursday, December 5, 2024

చీకట్లో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించిన మహిళ కంటిచూపుకు ముప్పొచ్చింది!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేటి ఆధునిక కాలంలో చాలా మంది అవసరముండి, అవసరం లేకుండానే ఫోన్‌లకు అలవాటు పడుతున్నారు. వారి అలవాటు చివరికి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ రాత్రిపూట స్మార్ట్ ఫోన్ వాడుతుండేది. రాత్రిపూట సోషల్ మీడియాలో తెగ స్క్రోలింగ్ చేయడంతో ఆమె కంటి చూపు పోయింది. ఈ విషయాన్ని హైదరాబాద్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అలవాటుగా స్మార్ట్‌ఫోన్ తెగచూసే ఆ 30 ఏల్ల మహిళ కంటిచూపు ఎలా పోయిందనేది ఆయన వివరించారు.

మంజు అనే ఆ మహిళ తన వద్దకు వచ్చి కదులుతున్నట్లు దృశ్యాలు, తీవ్ర మెరుపులు, డార్క్ జిగ్‌జాగ్ పాటర్న్‌లు కనిపిస్తున్నాయని, ఏ వస్తువును స్పష్టంగా చూడలేకపోతున్నానని తెలిపిందన్నారు. ఆ తర్వాత కంటి వైద్య పరీక్షలు జరిపాక, ఆమె స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్(ఎస్‌విఎస్) లేక కంప్యూటర్ విజన్ సిండ్రోమ్(సివిసి) తో బాధపడుతోందని, అది అంధత్వం సహా కంటి సమస్యలు కారణం కావొచ్చని తెలిపారు. ఆమె చూపు మందగించడానికి కారణం ఆమె ఎక్కువ సేపు ఫోన్ చూస్తుండడమేనన్నారు. ‘నేను ఆమె హిస్టరీని సమీక్షించాను. ఆమె తన బిడ్డ కేర్ కోసం తన బ్యూటీషన్ ఉద్యోగాన్ని వదిలేసింది. కానీ ఫోన్‌లో బ్రౌజింగ్‌కు అలవాటుపడింది. రోజు అనేక గంటలు ఫోన్ చూసేది. రాత్రుల్లో రెండు గంటలపాటు లైటార్పేసి కూడా చూస్తుండేది” అని డాక్టర్ సుధీర్ తన ట్విట్టర్‌లో రాశారు. అయితే ఫోన్ చూడ్డం తగ్గించమని ఆమెకు డాక్టర్ చెప్పాడు. తర్వాత ఆమె కంటిచూపు తిరిగి రికవర్ అయింది. నెల తర్వాత ఆమె చూపు బాగుపడింది. ఇప్పుడామె చూపు సాధారణ స్థితికి వచ్చింది. ఆమెకు ఇప్పుడు కదులుతున్నట్లు, మెరుపులు వంటి దృశ్యాలు రావడంలేదు, రాత్రిపూట కాసేపు చూపుపోయినట్లు కావడం వంటిదిలేదు. మా అనుమానమే నిజమైంది. అంతా విపరీత ఫోన్ అలవాటు అన్నది స్పష్టమైంది’ అని డాక్టర్ సుధీర్ తన ట్విట్టర్‌లో రాశారు.

ప్రజలు 2020 కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కాలం ఫోన్ చూడ్డంలో గడుపుతున్నారు. స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం వల్ల వారు కంటి చూపు సమస్యలకు గురవుతున్నారు. చీకట్లో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం వల్ల కూడా విపరీత సమస్యలు ఏర్పడుతాయి. ఈ అలవాటు మెదడుపై ప్రభావం చూపడమే కాదు, కంటిచూపుపై కూడా ప్రభావం చూపుతుంది అని రుజువైంది.

Dr. Sudheer tweet

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News