మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ 2023లో ఎట్టకేలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణి కొట్టింది. సొంతగడ్డపై పంజాబ్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ విజయంలో రాహుల్ త్రిపాఠి 10ఫోర్లు, 3సిక్సర్లతో 74పరుగులు చేసి కీలకపాత్ర పోషించాడు. త్రిపాఠికి మార్క్మ్ 21బంతుల్లో 6బౌండరీలతో 37పరుగులుతో అండగా నిలిచి జట్టు విజయంలో తనవంతు పాత్ర విజయవంతంగా పోషించాడు. పంజాబ్ నిర్దేశించిన 144పరుగుల రెఞూంజ్ ఆర్మీ ఓవర్లలోనే 145పరుగులుతో ఛేదించడం విశేషం.
ధావన్ ఒంటరిపోరు
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 9వికెట్లకు 143పరుగులు చేసింది. పంజాబ్ స్కిప్పర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 66బంతుల్లో 12ఫోర్లు, 5సిక్స్‌లతో 99పరుగులు చేసి త్రుటిలో సెంచరీని మిస్ అయ్యాడు. ధావన్‌కు తోడు సామ్ కరణ్ (22) ఆదుకోగా మిగిలిన పంజాబ్ బ్యాటర్లు సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి డిజిట్‌కే పరిమితమయ్యారు. కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు భువీ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ప్రభ్‌సిమ్రాన్‌సింగ్(0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పంజాబ్ కింగ్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది.
తరువాత ఓవర్లో మాథ్యూ షార్ట్ (1)ను మార్కో జాన్సెన్ ఔట్ చేశాడు. జితేశ్‌శర్మ ఔటవడంతో పంజాబ్ పవర్‌ప్లే 3వికెట్లుకు 41పరుగులు చేసింది. మార్కండే సామ్‌కరన్ ఔట్ చేయగా ఇంపాక్ట్ ప్లేయర్ సికిందర్ రాజా (5)ను ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్‌కు పంపాడు. ఓ వైపు పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టినా ధావన్ ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్నాడు. చివరి వికెట్‌కు ధావన్ 55పరుగులు జోడించడంతో పంజాబ్ కింగ్స్ మెరుగైన 143పరుగుల స్కోరును నమోదు చేసింది. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లలో మార్కండే 4వికెట్లుతో మెరవగా, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువీ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
రాణించిన రాహుల్ త్రిపాఠి
పంజాబ్ నిర్దేశించిన 144పరుగుల లక్ష ఛేదనలో సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. భారీ అంచనాల మధ్య బ్యాటింగ్‌కు దిగిన హ్యారీ బ్రూక్ (13) మరోసారి నిరాశపరిచి అర్షదీప్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్ (21)ను రాహుల్ చాహర్ ఔట్ చేశాడు. ఈక్రమంలో రాహుల్ త్రిపాఠి జట్టును ముందుకు తీసుకువెళ్లాడు. 35బంతుల్లో 7ఫోర్లు 2సిక్స్‌లతో 50పరుగులు చేసి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 13ఓవర్లలో స్కోరు 94/2కు చేరగా 42బంతుల్లో 50పరుగులుకు చేరుకుంది. త్రిపాఠికి కెప్టెన్ మార్క్మ్ అండగా నిలవడంతో మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు తిరిగింది. మొత్తంమీద సన్‌రైజర్స్ 17.1ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 145పరుగులు చేసి ఐపిఎల్ 2023లో బోణి కొట్టింది.