మన తెలంగాణ/హైదరాబాద్: రంజీ ట్రోఫీ సీజన్ 2024-25లో హైదరాబా ద్ టీమ్ తొలి విజయం సాధించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీ య క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 50 పరుగుల తేడాతో పాండిచేరి టీమ్‌ను ఓడించింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 536 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాండిచేరి మొదటి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్ అనికేత్ రెడ్డి 56 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి పాండిచేరి ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు.
అనంతరం ఫాలోఆన్ ఆడుతూ పాండిచేరి రెండో ఇన్నింగ్స్‌లో 333 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు గంగా శ్రీధర్ రాజు, అజయ్ రొహెరాలు జట్టును ఆదుకున్నారు. అజయ్ 9 ఫోర్లతో 69 పరుగులు చేశాడు. ఇదే సమయంలో తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించారు. మరోవైపు గంగా శ్రీధర్ రాజు 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 106 పరుగులు చేసి ఔటయ్యాడు.మిగతా వారిలో ఆకాశ్ (31), అంకిత్ శర్మ (22) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 7 వికెట్లను పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.