Monday, December 23, 2024

పంజాబ్‌పై గెలిచిన హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై హైదరాబాద్ సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ జట్టు విధించిన 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో కదం తొక్కగా చివరలో హెన్రీచ్ క్లాస్ దూకుడుగా బ్యాటింగ్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు అభిషేక్ శర్మ(66), రాహుల్ త్రిపాఠి(33), నితీశ్ రెడ్డి(37), హెన్రీన్ క్లాసెన్(42), షాబాద్ అహ్మద్(3), అబ్దుల్ సమాద్(11 నాటౌట్), శన్వీర్ సింగ్(6 నాటౌట్) పరుగులు చేశారు. 28 బంతుల్లో 66 పరుగులు చేసి అభిషేక్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ చెరో 2 రెండు వికెట్లు పడగొట్టగా హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News