Sunday, December 22, 2024

అమెరికాలో ఆకలితో అలమటిస్తున్న హైదరాబాద్ యువతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాస్టర్స్ చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి అక్కడ రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లి తన కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని కోరుతూ.. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన లేఖను ఎంబిటి నాయకుడు ఖలీకర్ రెహమాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. హైదరాబాద్ మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అనే యువతి మాస్టర్స్ చేసేందుకు 2021 ఆగస్టులో అమెరికా వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత తరచూ తన తల్లితో ఫోన్‌లో మాట్లాడేది. అయితే, రెండు నెలల నుంచి ఆ యువతి నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె స్పందన కోసం రోజూ ఎదురు చూస్తూ ఉండేవారు.

ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు జైదీని గుర్తించి.. తన పరిస్థితి గురించి హైదరాబాద్‌లోని తన తల్లికి సమాచారం అందించారు. యువతి వస్తువులు ఎవరో దొంగలించారని, దీంతో చికాగో రోడ్లపై జైదీ ఆకలితో అలమటిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో తన కుమార్తె పరిస్థితి తెలుసుకున్న యువతి తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా… తన కుమార్తెను తిరిగి భారత్‌కు తీసుకురావాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌ను కోరారు.ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ లేఖను ఆమె తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News