మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర గురువారం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి 17 ప్రశ్నలతో 17 చోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలను నగర యువత ఏర్పాటు చేసింది. రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును నిరిసిస్తూ వీటిని నెలకొల్పారు.
1. రాష్ట్రానికి డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయలేదు?
2. ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు మంజూరు చేయలేదు?
3. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ సైన్స్ అండ్ రిసెర్చ్ ఎక్కడ ఉంది?
4. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు?
5. పాలమూరు-…రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైంది?
6. కాజీపేట రైల్ కోచ్‌కు మంగళం ఎందుకు పాడారు?
7. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు ఎందుకు తరలించారు?
8. రాష్ట్రానికి కొత్తగా నవోదయ విద్యాలయాలను ఎందుకు మంజూరు చేయడంలేదు?
9. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు?
10. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ?
11. తెలంగాణకు ఐటిఐఆర్ ఏదీ?
12. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ జాడేది?
13. నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ మిషన్ భగీరథకు నిధులు ఎందుకు ఇవ్వలేదు?
14. మిగత రాష్ట్రాల్లో ఇచ్చిన విధంగా హైదరాబాద్‌కు వరద సాయం ఎందుకు చేయలేదు?
15. రాష్ట్రానికి మెగా పవర్లూమ్ టెక్స్టైల్స్ క్లస్టర్ ఒక్కటికూడా ఎందుకు మంజూరు చేయలేదు?
16. ఫార్మాసిటీకి ఆర్థిక సాయం ఏమైనా చేశారా?
17. తెలంగాణకు ఐఐఎం ఎక్కడ? వంటి అంశాలను పొందుపరిచారు.
17 Questions for PM Modi in Hyderabad