Sunday, December 22, 2024

యూసుఫ్ గూడలో టివి షోలో అవకాశం కల్పిస్తానని యువతిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టివి షోలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి యువతిపై లైంగిక దాడి చేసిన సంఘటన హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బస్సులో మేకప్ ఆర్టిస్ట్‌కు ఓ జూనియర్ ఆర్టిస్ట్ పరిచయమయ్యాడు. టివిషో అవకాశం కల్పిస్తానని మాయమాటలు చెప్పి డెమో కోసం యూసుఫ్‌గూడలోని ఓయో రూమ్‌కు తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ ఆమెపై అత్యాచారం చేసి అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మరో యువతితో కలిసి పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు బ్లాక్ మెయిల్ చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News