Sunday, December 29, 2024

అమెరికాలో బ్రెయిన్‌స్ట్రోక్‌తో హైదరాబాద్ యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంచి చదువుల కోసం అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడే చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి చెందిన విశ్రాంత ఆర్‌టిఒ తులసీరాజన్ కుమారుడు రుత్విక్ రాజన్(30) బిటెక్ పూర్తి చేయడంతో రెండు సంవత్సరాల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లాడు. టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేసి జాబ్ కోసం అన్వేషిస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా కిందపడిపోవడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. కుమారుడి మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం అర్థరాత్రి మృతదేహం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. రుత్విక్ మృతదేహాన్ని చూసి బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీంటిపర్యంతమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News