Friday, November 15, 2024

ప్లాస్టిక్ బదులుగా హైదరాబాద్ యువకుల నూతన ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తిరుమలలో ప్లాస్టిక్ నిషేదం ఉండడంతో, లీటర్ నీళ్ళను రూ.200/—– కు గాజు బాటిళ్ళలో అమ్మడంతో హైదరాబాద్ కు చెందిన యువకులు నూతన ఆవిష్కరణకు నాంది పలికారు. హైదరాబాద్‌కు చెందిన తాతినేని సునీత్, చైతన్య అనే యువకులు రోజువారి వ్యవహారాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే మంచి ఆలోచనతో పేపర్ వాటర్ బాటిళ్ళకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మన తెలంగాణ విలేఖరితో వారు ప్రత్యేకంగా మాట్లాడారు. తమ ఐటి ఉద్యోగాలకు రాజీనామా చేసిన యువకులు అంతర్జాలంలో, లైబ్రెరీలో చేసిన కఠోర పరిశోధన తరువాత పేపర్ వాటర్ బాటిళ్ళ అవిష్కరణకు శ్రీకారం చుట్టారు. పూర్తి స్థాయిలో కారిగేటెడ్‌పేపర్‌ను ఉపయోగించి మందంగా ఉండి నీటి బరువు ఆపేలాగ టేంపర్ ప్రూఫ్ వాటర్‌బాక్స్‌ను తయారు చేశారు.

ఈ బాటిళ్ళు ప్రస్తుతం కారో వాటర్ ప్యూరిఫైర్ హైదరాబాద్ అనే కంపెనీ ద్వారా నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ లభ్యమవుతాయని వారు పేర్కొన్నారు. కస్టమర్లకు అందుబాటులో ఉండడానికి వీటిని ఆండ్రాయిడ్, యాపిల్ స్టోర్లలో కారో వాటర్ అనే యాప్‌లో విక్రయిస్తున్నారు. కేవలం వాటర్‌బాటిళ్ళు మాత్రమే కాకుండా పేపర్ వాటర్‌క్యాన్‌లను కూడా వీరు తయారు చేస్తున్నారు. దేశంలోనే తొలి ఎకోఫ్రెండ్లీ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ళుగా వీరి అవిష్కరణకు పేరొచ్చింది. నూతన స్టార్టప్‌లలో ఇదో కొత్త ఆలోచన అవ్వడం, ఈ పేపర్ వాటర్‌బాటిళ్ళ ధరలు కూడా అందుబాటులోనే ఉండడంతో పర్యావరణ పరిరక్షణ చర్యలలో ఇది శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఐదు లీటర్ల వాటర్ బాక్స్ 75 రూపాయల ఉండగా, ఇరవై లీటర్ల వాటర్ బాక్స్ 120 రూపాయాలు ఉంది. ప్రజలదరికీ అందుబాటు ధరలలోకి వచ్చేలా త్వరలో ధరలు తగ్గుతాయని ఆ యువకులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News