Monday, December 23, 2024

సౌదీలో హైదరాబాద్ కు చెందిన దేశ భక్తుడికి జైలు

- Advertisement -
- Advertisement -

 

Hyderabaadi-arrested-in-Saudi Arabia

రియాద్: అతడు విదేశంలో నివసించినప్పటికీ దేశభక్తి నరనరాల్లో జీర్ణించుకున్నాడు. ఆ దేశ నియమనిబంధనలు తెలిసోతెలియకో తన దేశభక్తిని చాటుకుని ఓ హైదరాబాదీ జైలు పాలయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన అతడు సౌదీ అరేబియాలో స్థిరపడి ‘హైదరాబాదీ బిర్యానీ’ పేరుతో అనేక రెస్టారెంట్‌లు నిర్వహిస్తున్నాడు. కాగా ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పిలుపుతో ఆగస్టు 15న రియాద్‌లోని హై అల్ వజారాహ్ లో తన రెస్టారెంట్‌లో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాడు. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆ వేడుకలు నిర్వహించినందుకు అక్కడి పోలీసులు జైలులో పడేశారు. కొన్ని రోజుల పాటు జైలులో గడిపిన అతడు చివరికి విడుదలయ్యాడు. అతడు హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందిన వాడని తెలిసింది. సౌదీ అరేబియాలో ఏదైనా పబ్లిక్ ఈవెంట్ నిర్వహించాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. గతంలో పుణేకు చెందిన ఓ మహిళ కూడా ఇలాగే తెలియక తప్పు చేసింది. తన పిల్లలు, భర్తతో కలిసి అక్కడి మక్కా పుణ్యక్షేత్రం వద్ద భారత్ జెండా పట్టుకుని ఫోటో దిగింది. దానికి ఆమె ఐదు రోజులు జైలు జీవితం గడిపి విడుదలయింది. నిజానికి వారి కుటుంబం అక్కడే నివసించేది. మక్కాలో ‘ఉమ్రా’ చేసుకున్నాక వారు అక్కడ పవిత్ర ‘కాబా’ బ్యాక్ గ్రౌండ్ పడేలా దేశ జెండాతో ఫోటో దిగినందుకు జైలుపాలయ్యారు. 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News