Wednesday, January 22, 2025

జైపూర్ రైలు కాల్పుల్లో హైదరాబాదీ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: జైపూర్ ట్రైన్ కాల్పుల సంఘటనలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మృతిచెందాడు. జైపూర్ ముంబాయి సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి నలుగురిని పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. మృతుల్లో ఒకరు ఆర్‌పిఎఫ్ ఎఎస్సై కాగా ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఇందులో హైదరాబాద్, నాంపల్లి, బజార్‌ఘాట్‌కు చెందిన సయ్యద్ సైఫుల్లా ఉన్నారు.

మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఓ కూతురు వయస్సు ఆరు నెలలు ఉన్నాయి. రాజస్థాన్ జైపూర్ నుంచి ముంబాయి వెళ్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు మహారాష్ట్ర, పాల్ఘడ్ చేరుకున్న సమయంలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్పులు జరిపాడు. తనపై అధికారి ఎఎస్సై టికారామ్ మీనా, మరో ముగ్గురు ప్రయాణికులను కాల్చాడు. తర్వాత దహిసర్ స్టేషన్ వద్ద రైలు చైన్‌లాగి పారిపోగా, ముంబాయి పోలీసులు పట్టుకుని అతడి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

కాల్పుల్లో మృతిచెందిన హైదరాబాద్ వాసి సయ్యద్ సైఫుల్లా మృతదేహాన్ని తీసుకుని వచ్చేందుకు నాంపల్లి ఎమ్మెల్యే చొరవ తీసుకుంటున్నారు. బాధితుడికి కుటుంబాన్ని ఆదుకోవాలని హైదరాబాద్ ఎంపి ఓవైసి మంత్రి కేటిఆర్‌ను ట్విటర్‌లో ట్యాగ్ చేశారు. మరోవైపు ఈ కాల్పులపై సోషల్ మీడియాలో ఉగ్రకోణం దాగిఉందని ట్రెండ్ నడుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News