Sunday, January 12, 2025

నేడు హైదరాబాద్ లో ‘బ్లాక్ డే’ పాటించారు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాబ్రీ మస్జిద్ కూల్చివేత గుర్తుగా నేడు నగరంలో ‘బ్లాక్ డే’ పాటించారు. ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీలో.  ఇదే రోజున(అంటే 1992 డిసెంబర్ 6న) మొగల్ కాలం నాటి బాబ్రీ మస్జిద్ ను కూల్చేశారు. నేటి బ్లాక్ డే సందర్భంగా పాత బస్తీలోని మహబూబ్ గంజ్, ఘాన్సీ బజార్, ఇతర ప్రాంతాల్లో ‘బ్లాక్ డే’ పాటించారు. నాడు కరసేవకులు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ , బిజెపి, ఇతర హిందూ సంస్థలు యూపీలో చేసిన విధ్వంసాన్ని బ్లాక్ డే పాటించిన వారు ఖండించారు.  ముఖ్యంగా పాత బస్తీలోని ముస్లింలు ఈ బ్లాక్ డేను పాటించారు. చారిత్రాత్మక బాబ్రీ మస్జిద్ కూల్చివేత ఘటనను వారు గుర్తు చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News