Monday, December 23, 2024

ఖరీదైపోయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రాపర్టీ ధరలు పెరిగిపోవడం, హోమ్ లోన్ రేట్లు పెరిగిపోవడం కారణంగా 2022లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా ఖరీదైపోయింది. దేశంలోనే రెండో ఖరీదైన మార్కెట్‌గా మారింది. నైట్ ఫ్రాంక్ యొక్క ఆఫర్డేబిలిటీ ఇండెక్స్- 2022 ప్రకారం ముంబై రియల్ ఎస్టేట్ అత్యంత ఖరీదైనది. అక్కడ హోమ్‌లోని ఈఎంఐ సగటున ఆదాయంలో 53 శాతంగా ఉంది. ఆఫర్డబుల్ హోమ్‌లోన్ చౌకగా ఉన్నది అహ్మదాబాద్, గుజరాత్‌లోనే. అక్కడ ఈఎంఐ కేవలం 22 శాతం మాత్రమే.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ హోమ్ లోన్ ఈఎంఐ 2022లో ఆదాయంలో 30 శాతంగా ఉంది. 2019తో పోల్చినప్పుడు ఇది కాస్త మెరుగుగానే ఉంది. ఏడాది పూర్వం ఇది 34 శాతంగా ఉంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సిఆర్) ప్రకారం చైన్నైలో 29 శాతం, బెంగళూరులో 27 శాతంగా ఉంది. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దేశంలోనే రెండో అత్యంత ఖరీదైనదిగా ఉంది. ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు) ప్రధానంగా హైదాబాద్‌నే ఎంచుకుంటున్నారు. ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువ నివసిస్తున్నది అమెరికా, కెనడా, గల్ఫ్, యూరొప్ తదితర దేశాలలో. వారంతా ఇళ్ల కొనుగోళ్లకు హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నారు.

స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి రిటర్నులు ఎక్కువ అయినప్పటికీ ఎన్‌ఆర్‌ఐలు ప్రధాన నగరాలలో ఇళ్ల కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. అంటే ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీఎన్‌సిఆర్ వంటి చోట్ల. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడమే బెస్ట్ ఆప్షన్ అని ఎన్‌ఆర్‌ఐలు భావిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐలను ప్రశ్నించినప్పుడు వారిలో 77 శాతం మంది పెద్ద ఇళ్లకే మొగ్గుచూపారు. వారిలో 54 శాతం మంది 3బిహెచ్‌కె, 23 శాతం మంది 4 బిహెచ్‌కె, 22 శాతం మంది 2 బిహెచ్‌కెలకు ప్రాధాన్యత ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News