Wednesday, January 8, 2025

బడంగ్ పేట కార్పొరేషన్ లో హైడ్రా దూకుడు

- Advertisement -
- Advertisement -

అల్మాస్ గూడలో పార్క్ ఆక్రమణలు తొలగింపు
రెండు రోజుల క్రితం కెఎల్ఆర్ కు ఫిర్యాదు చేసిన వెంకటేశ్వర కాలనీవాసులు
త్వరలో మరిన్ని పార్కులకు మోక్షం: అధికారులు

రంగారెడ్డి: బడంగ్ పేట కార్పొరేషన్ లో పార్కులను ఆక్రమించిన అక్రమార్కులపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. అల్మాస్ గూడ 5వ డివిజన్ లోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో పార్కు స్థలాన్ని ఓ ఘనుడు దర్జాగా కబ్జా చేసి కంటైనర్ ఏర్పాటు చేశాడు. ఈ విషయంపై కాలనీ వాసులు రెండు రోజుల క్రితం మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జీ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అంతకు ముందు కమిషనర్, హైడ్రా, పోలీసులకు ఫిర్యాదు చేసిన లేఖలను లక్ష్మారెడ్డికి అందజేశారు.

హైడ్రా, పోలీస్, మున్సిపల్ ఉన్నతాధికారులతో కెఎల్ఆర్ మాట్లాడి… భూకబ్జాలపై ఉక్కుపాదం మోపాలని కోరారు. దీంతో తెల్లవారుజామున హైడ్రా, మీర్ పేట పోలీసులు సంయుక్తంగా పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన కంటైనర్ ను ధ్వంసం చేసి… చిన్నారులు ఆడుకునే వస్తువులను ఏర్పాటు చేశారు. పార్కుస్థలాన్ని కాపాడిన కెఎల్ఆర్ కు హైడ్రా, పోలీసు అధికారులకు వెంకటేశ్వర కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. బడంగ్ పేట కార్పొరేషన్ లో కబ్జాకు గురైన పార్కు స్థలాలపై ఫిర్యాదులు అందాయని త్వరలో వాటిపైనా చర్యలు తీసుకుంటామని హైడ్రా ఇన్సెపెక్టర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News