Saturday, January 18, 2025

చెరవీడిన అప్పా చెరువు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రాజేంద్రనగర్ : హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిపై నిలుచుంటే కనిపించే అప్పా చెరువులోని అక్రమ కట్టడాలపై హైడ్రా కన్నెర్రజేసింది. చెరువు స్థలంలో అక్రమంగా ని ర్మించిన భారీ షెడ్లను నేలమట్టం చేసింది. శనివారం ఉదయం నుంచి రాత్రి చీకటి పడే వరకు కూల్చివేతల పరంపర కొనసాగుతూనే ఉంది. అప్పా చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్‌లో నిర్మించిన 13 అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా 10 నిర్మాణాలను వాటిని నేలమట్టం చేసింది. సుమారు 3 ఎకరాలకు పైగా స్థలంలో కూల్చివేతలు జరిగిన ట్లు తెలుస్తోంది. సదరు స్థలం ఎఫ్‌టిఎల్‌లో పట్టా కలిగిన స్థానిక కార్పొరేటర్ కుటుంబానికి చెందినదిగా, ఆ కుటుంబం చాలా ఏళ్లుగా సాగు చేస్తునే ఉందని స్థానికుల ద్వారా తెలిసింది.

అయితే ఎఫ్‌టిఎల్‌లో అనుమతి లేకుండా నిర్మించిన కార్పొరేటర్ సంబంధీకులతో పాటు వారి వద్ద స్థలం కొనుగోలు చేసిన పలువురు వ్యాపారవేత్తలకు భారీ షె డ్లు ఉన్నాయి. వాటిని గుర్తించిన హైడ్రా రంగంలోకి దిగింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని అడ్డుపడిన ఎవరి మాటను హైడ్రా పరిగణనలోకి తీసుకుకోకుండా భారీ బం దోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించింది. కూల్చి వేతలు చేపట్టిన స్థలం, షెడ్ల విలువ సుమా రు 100 కోట్ల పైనే ఉంటుందని తెలుస్తోంది. మై లార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్‌కు చెందిన షెడ్లుగా కొన్నింటిని అధికారులు తెలిపారు.

రైల్వే ట్రాక్ కింద ఉన్న తూము మూసివేసి..
అప్పా చెరువులోకి ఎగువ ప్రాంతమైన గగన్‌పహాడ్, సాతంరాయి పరిధిలోని బ్రాహ్మణకుంట నుంచి వచ్చే నీరు వెళ్లకుండా అడ్డుగా రైల్వే ట్రాక్ కింద నుంచి ఉన్న తూమును గోడ నిర్మించి నీరు రాకుండా చేశారు. అదే అదనుగా ఎఫ్‌టిఎల్‌లో భారీ షెడ్లు నిర్మించుకున్నా కంపెనీలు, గోదాంలు నిర్వహిస్తున్నారు. కాగా, అధికారులు కూల్చివేతల విషయమై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కూ ల్చివేతల సమయంలో అక్కడే ఉన్న ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్‌ను వివరాలు కోరగా అన్ని వివరా లు హైడ్రా అధికారులే చెబుతారని బదులిచ్చారు.

గగన్‌పపహాడ్‌కు అసలు ముందు పేరు జ్ఞానిపేటగా స్థానిక పెద్దమనుషులు తెలిపారు. నిజాం కాలం కం టే ముందు జ్ఞానిపేటగా పిలువబడే తమ గ్రామం చార్మినార్ నిర్మాణానికి రాళ్లు ఇక్కడి నుంచి తీసుకువెళ్లిన కాలం నుంచి గగన్‌పహాడ్‌గా మారిందని త మ పూర్వీకులు చెబుతుండే వారని పలువురు వృద్ధు లు వివరించారు. హైడ్రా కూల్చివేతలు చేపట్టిన అ ప్పా చెరువుకు గొలుసుకట్టు అయిన బ్రాహ్మణకుం ట ఎక్కడ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సర్వే నంబర్ 113లో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ కుంట ఉంటుందని తెలిసింది.

పెద్ద ప్రమాదంలో పెద్ద చెరువు
ఇక అప్పా చెరువు నుంచి పారే అలుగు గగన్‌పహాడ్ గ్రామ సరిహద్దుల మీదుగా ప్రేమావతిపేట్ పెద్ద చెరువు (పూర్వపు మునికుంట). ఈ చెరువు సర్వే నంబర్ 81 నుంచి సర్వే నంబర్ 89 వరకు మొత్తం 97 ఎకరాల 26 గుంటలుగా స్థానికులు తెలిపారు.
జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ ప్రాజెక్టులో ఇప్పటికే ఆర్థికంగా ఉన్న పలువురు విల్లాలు, ఫ్లా ట్లు బుక్ చేసుకున్నారు. హైడ్రా అక్కడ కూడా అడు గు పెడితే విల్లాలు, ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏమిటో అప్పా చెరువు కూల్చివేతలను పరిశీలించే వారు అర్థం చేసుకోవాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News