Sunday, January 19, 2025

అవి అక్రమ కట్టడాలే.. కూల్చక తప్పదు: రంగనాథ్

- Advertisement -
- Advertisement -

కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో అనుమతులు ఇచ్చి తరువాత రద్దు చేస్తే అవి అక్రమ కట్టడాలనేని స్పష్టం చేశారు. హైడ్రా
హైడ్రా రాక ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదని చెప్పారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే.. వాటిని కూడా కూల్చమన్నారు. ఎఫ్‌టీఎల్‌లో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం కూల్చక తప్పదని ఆయన పేర్కొన్నారు.

గతంలో అనుమతులు ఇచ్చి తరువాత రద్దు చేస్తే అవి అక్రమ కట్టడాలేనని తెలిపారు. పేదలను ముందు పెట్టి వెనుక నుంచి చక్రం తిప్పుతున్న ల్యాండ్ గ్రాబర్స్‌ చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. మల్లంపేట కత్వా చెరువు, అమీర్‌పూర్‌లో కూల్చివేతలు అక్రమ కట్టడాలని చెప్పారు. హైదరాబాద్‌లో చెరువుల ఎఫ్‌టీఎల్‌ మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే హైడ్రా మొదలు పెట్టిందని రంగనాథ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News