Sunday, December 22, 2024

కూల్చివేతలపై ‘హైడ్రా’ కమిషనర్ కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా నేడు కూడా అనేక కూల్చివేతలతో ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో, కూల్చివేతలకు సంబంధించి ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ మరింత స్పష్టత ఇచ్చారు.

నిబంధలనకు విరుద్ధంగా ఉండి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే కూల్చివేస్తున్నట్టు తెలిపారు. ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ లో ఉన్నప్పటికీ ఆయా నిర్మాణాల్లో ఎవరైనా నివాసం ఉంటే ఆ నిర్మాణాలను కూల్చడంలేదని స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రజలకు హామీ ఇస్తున్నామని తెలిపారు. ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉంటున్న స్థలాలను, ఇళ్లను కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు. మల్లంపేట చెరువు బఫర్ జోన్ లో ఉన్న కట్టడాలు నిర్మాణ దశలో ఉన్నాయని, అందుకే వాటిని కూల్చివేస్తున్నామని రంగనాథ్ వివరించారు.

ఇక సున్నం చెరువులో వాణిజ్యపరమైన నిర్మాణాల కూల్చివేతలపై స్పందిస్తూ… గతంలోనే ఇక్కడి షెడ్లను కూల్చివేసినప్పటికీ మళ్లీ నిర్మిస్తున్నారని, అందుకే వాటిని కూల్చివేస్తున్నామని అన్నారు. మాజీ ఎంఎల్ఏ కాటసాని భూపాల్ రెడ్డి, బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News