Friday, November 22, 2024

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

కావూరిహిల్స్ పార్కు స్థలంలో టెన్నిస్, వాలీబాల్ కోర్టులు, జిమ్ షెడ్ల కూల్చివేత
ఇబ్రహీంపట్నంలోనూ హైడ్రా బృందం పరిశీలనలు

మనతెలంగాణ/మాదాపూర్: పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మించిన టెన్నిస్ కోర్ట్‌ను, షెడ్‌లను సోమవారం హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు కలిసి కూల్చివేశారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని కావూరి హిల్స్ కాలనీకి చెం దిన పార్క్‌లో ఓ మహిళ సూర్య టెన్నిస్ కోర్ట్ ను అక్రమంగా నడిపిస్తుంది. జీహెచ్‌ఎంసీ అ ధికారులు, సొసైటీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణవేణి అనే మహిళ గత 10 సంవత్సరాలుగా పార్క్‌లో అక్రమంగా టెన్నిస్ కోర్ట్‌ను నిర్వహిస్తుంది. మొదటి ఏడాది సొసైటీ వారి వద్ద ఆ స్థలాన్ని లీజుకు తీసుకుంది. తరువాత రెండు, మూడు సంవత్సరాలు జీహెచ్‌ఎంసీ స్పోర్ట్ ఎస్టేట్‌కు ఫీజును కట్టి రెన్యువల్ చేసుకుంది.

నాలుగోవ సంవత్సరం నుండి అటు జీహెచ్‌ఎంసీ స్పోర్ట్ ఎస్టేట్‌కు ఇటు సొసైటీకి గాని ఎటువంటి ఫీజు చెల్లించకుండా యథావిధిగా నడిపిస్తుంది. దీంతో స్పోర్ట్ ఎస్టేట్‌కు ఎటువంటి ఫీజు చెల్లించడం లేదని తెలుసుకున్న సొసైటీ ప్రతినిధులు చందానగర్ సర్కిల్ 21 కార్యాలయంలో అధికారులకు ఫిర్యా దు చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు హైడ్రా అధికారులకు లేఖ రాయగా హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు సం యుక్తంగా సోమవారం ఉదయం 6 గంటలకు పార్క్‌లో అక్రమంగా వెలిసిన టెన్నిస్ కోర్ట్, జిమ్, వాలీబాల్ కోర్ట్‌ను కూల్చివేశారు. అనుమతులు లేనిదే ఎటువంటి కార్యకలాపాలు పా ర్క్‌లో నిర్వహించరాదని నిర్వాహకులను హెచ్చరించారు. అ నంతరం షెడ్‌లను కూల్చివేసిన స్థలంలో ప్రభుత్వ స్థలం అని బోర్డు ఏర్పాటు చేశారు. ఎక్కడైన ప్రభుత్వ స్థలాలలో అక్రమంగా నిర్మాణాలు చేసిన, షెడ్‌లను ఏర్పాటు చేసిన తప్పకుండా కూల్చివేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.

ఇబ్రహీంపట్నంలో హైడ్రా పర్యటన
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పెద్ద చెరువు, చిన్న చెరువుతోపాటు పోచారం, ఉప్పరిగూడలో ఉన్న ఆయకట్టు ప్రాంతాన్ని హైడ్రా బృందం అధికారులు పాపయ్య, ఇరిగేషన్ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. 1955లో నిర్మించిన పెద్ద చెరువు, చిన్న చెరువు కలిసి మొత్తం 1,452 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండితే సుమారు 15 వందల ఎకరాలలో పంటల సాగు చేస్తారు. దీంతో సుమారు వంద గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి.

చిన్న చెరువు, పెద్ద చెరువు ఇబ్రహీంపట్నం, ఉప్పరిగూడ, పోచారం, శేరిగూడ, చెర్లపటేల్ గూడ, గ్రామాల్లో ఆనుకుని ఉండడంతో ఎఫ్‌టిఎల్ పరిధిలో హద్దురాళ్ళు ఉన్నప్పటినీ అక్రమ కట్టడాలు వెలిశాయని అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ ఎఫ్‌టిఎల్ హద్దురాళ్ళు దాటి కొంతమంది ఇండ్లు కట్టడమే కాకుండా కబ్జాలకు పాల్పడ్డార ని హైడ్రా అధికారులు ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉండడంతో నిర్మాణాలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. దీంతో ఇరిగేషన్ అధికారులు పొంతనలేని సమాచారం ఇవ్వడంతో వారిపై హైడ్రా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్టం వచ్చినట్లు అనుమతి ఇవ్వడంతో అనేకమంది ఇండ్లు నేలమట్టం కావా ల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇకముందు ఇష్టం వచ్చినట్లు అనుమతి ఇస్తే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. బఫర్ జోన్ వరకు హైడ్రా బృందం పరిశీలించింది. ఎఫ్‌టిఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయకముందే ఇండ్ల నిర్మాణాల యజమానులు నిర్ణయం తీసుకోవాలని హైడ్రా అధికారులు సూచించారు.

ఆక్రమణదారుల్లో గుబులు
ఇబ్రహీంపట్నం పెద్ద చెరవు, చిన్న చెరువు, ఉప్పరిగూడ ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్న హైడ్రా అధికారులు బుల్డోజర్లతో ఎ ప్పుడు వచ్చి కూల్చుతారో, నేలమట్టం చేస్తారోనని భయం గుప్పిట్లో ఆక్రమణదారులు ఉన్నారు. నెల రోజులుగా నగరం లో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చి వేసిన విషయం తెలిసిందే. మొదటిసారిగా జిల్లాలో హైడ్రా ప్రవేశించడంతో ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో ఇండ్ల నిర్మాణాలను చేపట్టిన వారి గుండెళ్ళో గుబులు మొదలైంది. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎఒ రాజ్యలక్ష్మి, ఏసిపి రాజు, హైడ్రా బృందం సభ్యులు, ఎస్‌ఐ రామకృష్ణ తదితరులు పాల్లొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News