Thursday, December 19, 2024

నల్లచెరువులో ఆక్రమణలను కూల్చేస్తున్న హైడ్రా.. భారీగా పోలీసులు మోహరింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైడ్రా దూకుడు పెంచింది. నగరంలో మళ్లీ కూల్చివేతలను షురూ చేసింది. అమీన్పూర్, కూకట్పల్లిలోని అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. నల్లచెరువు పరిధిలోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మించిన సుమారు 16 షెడ్లను హైడ్రా అధికారులు కాల్చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామునే ప్రొక్లెయినర్లతో చేరుకున్న అధికారులు.. కూల్చివేతలు ప్రారంభించారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. నల్ల చెరువు విస్తీర్ణం మొత్తం 27 ఎకరాలు కాగా.. 14 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు గుర్తించారు. చెరువును ఆక్రమించి 16 షెడ్లు నిర్మించి వ్యాపారం నిర్వహిస్తున్న వారికి.. సర్వే చేసి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇక, అమీన్పూర్ కిష్టారెడ్డి పేట్, పటేల్గూడలో 28 విల్లాలు, 3 అపార్ట్మెంట్లు.. నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి భవనాన్ని హైడ్రా కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది. మరో 2 విల్లాలకు కూడా హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఇక, మూసీ ఆక్రమణలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. మూసీ పరీవాహక ప్రాంతంలో 12 వేల ఆక్రమణలు గుర్తించినట్లు సమాచారం. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. దీంతో ఈరోజు నుంచి మూసీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రారంభించనుంది హైడ్రా. అయితే, ఇండ్లు కోల్పోయిన మూసీ పరీవాహక నిర్వాసితులకు ప్రభుత్వం.. డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News